: ఎయిర్ పోర్టులో రన్ వేపై బైఠాయించిన జగన్!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే అరెస్టు చేస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఎయిర్ పోర్టులోని రన్ వేపై బైఠాయించారు. ఆయనతోపాటు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, జగన్ కు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలెవరూ ఎయిర్ పోర్టుకు రాకుండా ఎన్ఏడీ కొత్తరోడ్, షీలానగర్ వైపు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎయిర్ పోర్టులో ఎంటరవ్వాలంటే ఐడీతో పాటు అనుమతి పత్రం కూడా చూపాల్సి వస్తోంది.