: పద్మభూషణ్ రావాలంటే ఇంతకంటే ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు: బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ఆగ్రహం
ప్రముఖ బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్ అవార్డుల్లో తనపేరు పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడ్డాడు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన అద్వానీ ‘కృతజ్ఞతలు సర్. 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించా. ఐనా పద్మభూషణ్‌కు నన్ను పక్కన పెడుతున్నారంటే ఇంకా నేనేం సాధించాలో అర్థంకావడం లేదు’ అని ట్వీట్ చేశాడు. కాగా, గత ఎనిమిదేళ్లుగా వరుసగా ప్రపంచ టైటిళ్లు అందుకొంటున్న పంకజ్ అద్వానీకి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వం, భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. అయినప్పటికీ కేంద్రం అతనిని పరిగణనలోనికి తీసుకోకపోవడం విశేషం.