: 'ధనాధన్'కు టైమొచ్చింది... నేటి నుంచి టీ ట్వంటీ పోరు!
ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లు ముగిశాయి. వన్డేలు ముగిశాయి. ఇక నేటి నుంచి పొట్టి క్రికెట్ సిరీస్ మొదలు కానుంది. నేటి సాయంత్రం కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్యా తొలి టీ-20 పోరు జరగనుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోరు సాయంత్రం 4:30 గంటలకే ప్రారంభం కానుంది. టెస్టులు, వన్డేల మాటెలా ఉన్నా, టీ-20లకు వచ్చేసరికి రెండు జట్లూ బలంగానే కనిపిస్తుండటంతో ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
ఇక గత సంవత్సరం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ జట్టు తరఫున ఆడుతూ, విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దిగి అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ, ఈ సిరీస్ లో తొలిసారి ఓపెనర్ గా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ కు చెందిన రాయ్, రూట్, బట్టర్, స్టోక్స్, మోర్గాన్ వంటి ఆటగాళ్లు రాణిస్తుండటం, వారికి భారత పిచ్ లపై అవగాహన పెరగడంతో ఈ సిరీస్ ఉత్కంఠగా సాగుతుందని అంచనా.
ఇరు జట్ల వివరాలు (అంచనా)
భారత్: 1. కేఎల్ రాహుల్ లేదా మన్‌దీప్ సింగ్, 2. విరాట్ కోహ్లి (కెప్టెన్), 3. సురేష్ రైనా, 4. యువరాజ్ సింగ్, 5. మహేంద్ర సింగ్ ధోని, 6. మనీష్ పాండే, 7. హార్దిక్ పాండ్య, 8. పర్వేజ్ రసూల్, 9. అమిత్ మిశ్రా, 10. ఆశిష్ నెహ్రా, 11. భువనేశ్వర్ లేదా బుమ్రా
ఇంగ్లాండ్: 1. శామ్ బిల్లింగ్స్, 2. జేసన్ రాయ్, 3. జాయ్ రూట్, 4. ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), 5. జాస్ బుట్లర్, 6. బెన్ స్టోక్స్, 7. మోయిన్ అలీ, 8. లియామ్ ప్లంకెట్, 9. క్రిస్ జోర్డాన్, 10. టైమల్ మిల్స్, 11. జేక్ బాల్