: ప్రజల్ని మాట్లాడనివ్వరా?: పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి గంటకూ ఒక ట్వీట్ చొప్పున చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును కడిగేస్తున్నారు. తాజాగా ట్వీట్ చేసిన ఆయన 'ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వాలన్నదీ మీరే... అద్భుతాలు చేయడానికి ప్రత్యేకహోదా సంజీవని కాదు అన్నదీ మీరే... హోదాను మించిన ప్యాకేజీ అంటూ చప్పట్లు కొట్టింది కూడా మీరే... ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని కూడా మీరే చెప్పారు.... అసలు చట్టబద్ధతే అక్కర్లేదని చెబుతున్నది కూడా మీరే... మీరేం చెప్పినా ప్రజలు విన్నారు... మరి ప్రజలేమనుకుంటున్నారో చెప్పే అవకాశం ఒక్కసారి కూడా ఇవ్వరా?' అని నిలదీశారు.



  • Loading...

More Telugu News