: కేజ్రీవాల్ పై నలుగురు దాడి చేసే అవకాశం ఉంది: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

భారత గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు కేజ్రీవాల్ కార్యాలయానికి ఓ ఈ మెయిల్‌ ను పంపినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల అధికారి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని కనీసం నలుగురు వ్యక్తులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ దాడులు కూడా ఎదురుగా వచ్చి కాకుండా, హెలికాప్టర్‌, చార్టర్‌ ఫ్లైట్ వంటి వాటితో దాడులకు దిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు భారత్ లో ప్రముఖులపై దాడులు చేయడం ద్వారా బీభత్సం సృష్టించే అవకాశం ఉందని ఇదివరకే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 50 వేల బలగాల్ని మోహరించి, అణువణువు తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్, విమానాల దాడులను నిర్వీర్యం చేసే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

More Telugu News