: అలాంటి బౌలర్లను చాలా మందిని ఎదుర్కొన్నా: కోహ్లీ

ఇంగ్లాండ్ జట్టులోకి కొత్తగా వచ్చిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ తైమల్ మిల్స్ గురించి తమకు ఎటువంటి ఆందోళన లేదని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసిరే చాలా మంది బౌలర్లను ఎదుర్కొన్నానని, 90 మైళ్ల వేగం అనేది పెద్ద సమస్య కాదని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు అవసరమైన నైపుణ్యాలు తైమల్ మిల్స్ లో ఉన్నందుకే అతడిని టీ 20 స్పెషలిస్టు బౌలర్ గా ఇంగ్లాండు తీసుకువచ్చిందేమో! అని, రెండో మ్యాచ్ ఆడిన తర్వాత మిల్స్ గురించి తాను మాట్లాడే అవకాశం ఉందని కోహ్లీ చెప్పాడు. కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 

More Telugu News