: పాక్ మహిళా ఎంపీకి క్షమాపణలు చెప్పిన మంత్రి!


పాకిస్థాన్ మహిళా ఎంపీ నుస్రత్ సహర్ అబ్బాసీని వేధించిన మంత్రి ఇమ్దాద్ పిటాఫి ఆమెకు క్షమాపణలు చెప్పారు. సభలో ఆమెకు గౌరవ పూర్వకంగా చాదర్ ఇచ్చిన సదరు మంత్రి,  అందరి ముందు క్షమాపణలు చెప్పారు. అయితే, ఎంపీలకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే, సామాన్య మహిళల సంగతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కాగా, సింధ్ ప్రావిన్స్ కు చెందిన ఎంపీ నుస్రత్ పార్లమెంట్ సమావేశానికి ఇటీవల హాజరయ్యారు.

ఇదే సమావేశానికి వచ్చిన మంత్రి ఇమ్దాద్ పిటాఫి, ఆమెను తన వ్యక్తిగత ఛాంబర్ కు రావాలంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ విషయమై మహిళా డిప్యూటీ స్పీకర్ కు ఆ ఎంపీ  ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన నుస్రత్, ఆ మంత్రిపై యాక్షన్ తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను చూపిస్తూ బెదిరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ కావడంతో, ఫెడరల్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News