: టికెట్ల రగడ ... యూపీ బీజేపీ అధ్యక్షుడు ఘెరావ్!

పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని పక్కన పెట్టి, బయటి వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. స్థానిక నాయకులకు టికెట్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తూ లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కార్యకర్తలు భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్  బీజేపీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్యను ఘెరావ్ చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తీరుపై కూడా కొంతమంది కార్యకర్తలు తమ అసహనం, నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

More Telugu News