: టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఊరట... కేసును కొట్టేసిన కోర్టు

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై గతంలో నమోదైన రైల్ రోకో కేసును సికింద్రాబాద్ రైల్వే కోర్టు కొద్దిసేపటి క్రితం కొట్టేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్వే ట్రాక్ లపై బైఠాయించి, రైళ్ల రాకపోకలను అమె అడ్డుకునే ప్రయత్నం చేసిందని అప్పట్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నేడు జరుగగా, కోర్టుకు హాజరైన ఆమెకు ఊరట లభించింది. ఇదే కేసు నుంచి కోదండరామ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలకు గతంలోనే విముక్తి లభించిన సంగతి తెలిసిందే.

More Telugu News