: ఈయన సుందర ముఖారవిందాన్ని చూసి పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు: జగన్ ఎద్దేవా
రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తానని గొప్పలు చెప్పుకుంటూ దేశాలు పట్టుకు తిరగడమే చంద్రబాబు పనిగా మారిందని, ఒక్క పరిశ్రమనూ ఇప్పటివరకూ ఆయన తీసుకురాలేదని వైఎస్ జగన్ విమర్శించారు. "నేను అడుగుతావున్నా... ఈయన దావోస్ కు పోయినా, సింగపూరుకు పోయినా, చైనాకు పోయినా, జపాన్ కు పోయినా... ఏ దేశానికి పోయినా, ఈయన సుందర ముఖార విందాన్ని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలంటే కావాల్సిన పారిశ్రామిక రాయితీలు ప్రత్యేక హోదాతో మాత్రమే వస్తాయి. హోదా ఉండే రాష్ట్రానికి లభించే రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి" అని వ్యాఖ్యానించారు.