: వైజాగ్ లో నిరసన కార్యక్రమానికి అనుమతిలేదు: కలెక్టర్, సీపీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం జల్లికట్టు, తెలంగాణ ఉద్యమాల స్పూర్తితో ఈనెల 26న సాయంత్రం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో శాంతియుత నిరసన కార్యక్రమానికి ఎవరు పిలుపునిచ్చారో తమకు తెలియదని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, సీపీ యోగానంద్ తెలిపారు. విశాఖపట్టణంలో వారు మాట్లాడుతూ, తమను ఎవరూ అనుమతి కోరలేదని, ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు.

అందువల్ల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తమ పిల్లలను ఆందోళన కార్యక్రమానికి పంపవద్దని సూచించారు. అంతేకాకుండా ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మక పార్టనర్‌ షిప్‌ సమ్మిట్‌ ఉన్నందున ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతివ్వడం లేదని వారు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికిప్పుడు అనుమతి కోసం దరఖాస్తు చేసినా ఇంత తక్కువ సమయంలో అనుమతి ఇవ్వలేమని చెప్పారు. 

More Telugu News