: నటుడు అజయ్ దేవ్ గణ్ తల్లికి అస్వస్థత..ఐసీయూలో చికిత్స

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ తల్లి వీణ అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని శాంతాక్రజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లుగా వైద్యులు తెలిపారు. ‘బాద్ షాహో’ చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్ పూర్ లో ఉన్న అజయ్ కు  ఈ సమాచారం తెలియడంతో వెంటనే ముంబయి చేరుకున్నాడు. కాగా,అజయ్ దేవ్ గణ్ తల్లి వీణ గతంలో కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆమె అనారోగ్యానికి గురయ్యారు.

More Telugu News