: ‘జల్లికట్టు’ ఎఫెక్టు.. థియేటర్లలో పెప్సీ, కోక్ పై బ్యాన్ !
తమిళనాడులో ‘జల్లికట్టు’ ఉద్యమ ప్రభావం విదేశీ శీతల పానీయాలపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో పెప్సీ, కోకోకోలా వంటి విదేశీ శీతల పానీయాలను నిషేధించాలని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ‘జల్లికట్టు’ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మధురై, విరుద్ నగర్, రామనాథపురం తదితర ప్రాంతాల్లోని కొన్ని థియేటర్లలో పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్స్ విక్రయాలను ఇప్పటికే నిలిపివేశారు.