: సుందరాంగుల మధ్యలో ఆ దేశ అధ్యక్షుడు!

ఫిలిప్పీన్స్ లో ఈ నెల 30న మిస్ యూనివర్స్ ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల సుందరాంగులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మలకనంగ్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రియో డ్యుటెర్టె పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన ఫొటోకు పోజ్ లిచ్చారు. డ్యుటెర్టెతో పాటు ఆ దేశ పర్యాటక శాఖ కార్యదర్శి వాండ టియో కూడా పాల్గొన్నారు. కాగా, మరో వారం రోజుల్లో జరగనున్న ఈ పోటీల్లో భారత్ తరపున ఇద్దరు సుందరాంగులు పాల్గొంటున్నారు. 

More Telugu News