: 19 బహుళ అంతస్తుల భవనాలు పది సెకెన్లలో నేలమట్టం!

బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలంటే చాలా కష్టపడాలి. మరి, అదే బహుళ అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయాలంటే? సెకెన్ల వ్యవధి చాలన్న సంగతిని చైనా తాజాగా నిరూపించింది. చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ లోని హాంకౌలో 15 హెక్టార్లలో పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ఈ ప్రాంతంలో మూడున్నర బిలియన్లతో 707 మీటర్లకంటే ఎత్తైన బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని చైనా ప్రభుత్వం భావించింది. దీంతో, ఇందులో 12 అంతస్తులతో సుమారు 32 భవనాలుండగా, వీటిలో 13 భవనాలను గతంలో కూల్చేశారు. మిగిలిన 19 భవనాలను తాజాగా 5 టన్నుల బరువైన పేలుడు పదార్థాలను వీటి కిందపెట్టి పది సెకెన్లలో కూల్చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భారీ ఎత్తున ధూళి ఎగసిపడింది. శత్రుదేశం క్షిపణి దాడి చేసిందా? అన్న స్థాయిలో అక్కడ దుమ్ముధూళి ఎగసి పడడం విశేషం.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/3zOe4xdF9L0" frameborder="0" allowfullscreen></iframe>

More Telugu News