: ఆరో స్థానానికి అతనే సరైనోడు : సునీల్ గవాస్కర్

టీమిండియా లేటెస్ట్ సెన్సేషన్ కేదార్ జాదవ్ పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. తొలి వన్డే, చివరి వన్డేల్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడంతో వెటరన్ లంతా జాదవ్ ను అభినందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, జట్టులో ఆరో స్థానానికి కేదార్ జాదవ్ అణిముత్యమని అన్నారు. ఆరో స్ధానానికి సరైన ఆటగాడు జాదవ్ అని చెప్పారు. రెండేళ్ల అనంతరం మరోసారి జట్టులో స్థానం సంపాదించుకున్న జాదవ్ చక్కటి మ్యాచ్ ఫినిషర్ నని చాటుకుంటున్నాడని అన్నారు. అతని ఆటతీరు చూసిన తరువాత ఆణిముత్యంలాంటి క్రికెటర్ ను బీసీసీఐ పట్టుకుందనిపిస్తోందని ఆయన చెప్పారు. చక్కటి టైమింగ్ తో జాదవ్ షాట్లు ఆడుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. జాదవ్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడని, ఆరోస్థానమే అతనికి సరైనదని ఆయన తెలిపారు. 

More Telugu News