: జల్లికట్టు రచ్చ.. 20 మంది పోలీసులకు గాయాలు.. చెన్నయ్ లో భారీగా ట్రాఫిక్‌జాం

జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్ప‌టికీ ప‌ట్టుబ‌ట్టి కూర్చున్న తమిళ యువతను ఈ రోజు పోలీసులు చెదరగొట్టి మెరీనా బీచ్ ని ఖాళీ చేయించిన విష‌యం తెలిసిందే. దీంతో తమ పోరాటాన్ని హింసాత్మ‌కంగా మార్చేసిన ఆందోళనకారులు ఐస్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్ ముందు ఉన్న కారు, ఆటో సహా 25 వాహనాలకు నిప్పుపెట్టడంతో సుమారు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్ ను అధికారులు రంగంలోకి దించి, ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్ర‌యోగం చేశారు. ఆందోళ‌న‌ల‌తో చెన్నయ్ నగరంలో పెద్ద ఎత్తున‌ ట్రాఫిక్‌జాం ఏర్ప‌డింది.

More Telugu News