rail accident: హిరాఖండ్‌ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం: మరో రెండు మృతదేహాలు లభ్యం

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో మరో రెండు మృత‌దేహాలు ల‌భించాయ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 41కి చేరిందని పేర్కొన్నారు. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో జ‌రిగిన ఈ ఘోర ప్ర‌మాదంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన సిబ్బంది ధ్వంసమైన బోగీల నుంచి నిన్న 39 మృతదేహాలను వెలికితీసిన విష‌యం తెలిసిందే. కాగా, ప్రమాద ప్రాంతాన్ని రైల్వే సేఫ్టీ టీమ్‌ ఈరోజు స‌మ‌గ్రంగా పరిశీలించింది.
rail accident

More Telugu News