: ట్రంప్ అనైతికుడు, వంచకుడు: ముఖాకృతిని విశ్లేషించిన బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖాకృతిలోనే తేడా ఉందని బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ తరహా ముఖాకృతి ఉన్నవాళ్లు దూకుడైన మనస్తత్వంతో ఉంటారని, వారు అనైతిక ప్రవర్తననూ చూపుతారని పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక ఆయన ముఖాకృతి కూడా సాయపడిందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎత్తు, ముఖం ఉన్న ఆకారం తదితరాలు అతను నాయకుడిగా ఎదిగే తీరును ప్రభావితం చేస్తాయని మరోసారి తేటతెల్లమైందని తెలిపారు. ట్రంప్ ఎఫ్. డబ్ల్యూ.హెచ్.ఆర్ (ఫేసియల్ విడ్త్ టు హైట్ రేషియో)ను విశ్లేషించి ఈ విషయాలు కనుగొన్నామని, ఇతరుల నమ్మకాలను వంచించి వీరు దోచుకుంటారని, వీరితో ముప్పు అధికమేనని తెలియజేశారు.