: రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలి: వీహెచ్ డిమాండ్


ఖజానా నింపుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. మద్యం అమ్మకాలు పెరగడం వల్ల తాగుబోతులు వీరంగమేస్తున్నారని... వీరివల్ల మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మద్యం వల్ల యువత కూడా తప్పుదారి పడుతోందని అన్నారు. బీహార్ తరహాలో అన్ని పార్టీలతో చర్చించి, మద్య నిషేధంపై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. 

  • Loading...

More Telugu News