: ప్రియాంక గాంధీ చొరవతో టెన్షన్ కు ఫుల్ స్టాప్!


ఉత్తరప్రదేశ్ ఎన్నికల పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ చక్రం తిప్పారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు విషయంలో ఆమె కీలక భూమిక పోషించారు. రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లే అని అందరూ భావిస్తున్న తరుణంలో ప్రియాంక రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అఖిలేష్ కు ఫోన్ చేసి, పొత్తు కుదిరేలా చేశారు. అఖిలేష్ కు ప్రియాంక ఫోన్ చేసినప్పుడు, అతని భార్య డింపుల్ కూడా ప్రియాంక వద్దే ఉన్నారు. పొత్తు విషయంలో డింపుల్ కూడా కీలకంగా పని చేసినట్టు తెలుస్తోంది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా... పొత్తులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.  

  • Loading...

More Telugu News