: అల్లుడిని నియమించుకునే అధికారం ట్రంప్‌కు ఉంది.. స్పష్టం చేసిన న్యాయశాఖ
వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుడిగా తన అల్లుడు జరేడ్ కుష్నర్‌ను ట్రంప్ నియమించడంపై వస్తున్న విమర్శలకు అమెరికా న్యాయశాఖ చెక్‌పెట్టింది. అల్లుడిని నియమించుకునే అధికారం అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఉందని స్పష్టం చేసింది. అలా నియమించడం చట్టవ్యతిరేకమేమీ కాదని తేల్చి చెప్పింది. కాగా వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర నిఘా విభాగం(సీఐఏ) ప్రతినిధులతో తొలిసారి సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని అణచివేసే సమయం దగ్గరపడిందన్నారు. మరోవైపు తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రజలెవరూ పెద్దగా హాజరుకాలేదని రాసిన పాత్రికేయులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.