kohli: పోరాడి ఓడిన భారత్.. చివరి వన్డేలో ఇంగ్లండ్ విజయం!

షార్ట్స్‌లో చూడండి
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ రోజు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నువ్వా? నేనా? అన్న రీతిలో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ చివరి వరకూ పోరాడింది. టాప్ ఆర్డర్ అంతగా రాణించని సమయంలో బ్యాటింగుకి దిగిన హార్దిక్ పాండ్యా (56), కేదార్ జాదవ్ (90) అద్భుతంగా ఆడి భారత్ స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో జాదవ్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడం భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. కాగా, ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచి, సీరీస్ ను ఇండియా కైవసం చేసుకున్న సంగతి విదితమే.
Go Back to Shorts
kohli
jadav

More Telugu News