arrests: అసభ్యకర పోస్టులు పెట్టిన ఆరోపణలపై మయన్మార్‌ బ్యూటీ క్వీన్‌ మ్యోకోకోసాన్‌ను అరెస్టు!

సామాజిక మాధ్య‌మాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేయ‌డంతో మయన్మార్‌ బ్యూటీ (ట్రాన్స్‌జెండర్‌) మ్యోకోకోసాన్‌ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పోస్టుల‌తో పాటు ఆమె అసభ్యకరమైన పదజాలం ఉపయోగించింద‌ని పోలీసులు చెప్పారు. థాయిలాండ్‌ నుంచి తిరిగొస్తున్న ఆమెను యాంగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. ఆమెను ప్రస్తుతం మహిళల జైలులో ఒంటరిగా ఉంచిన పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు. టెలీకమ్యునికేషన్‌ చట్టం ప్రకారం సెక్షన్‌ 66(డీ)కింద ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వుట్‌ మోన్‌ యీ అనే వ్యక్తిని అవమానించేలా ఆమె సామాజిక మాధ్య‌మాల్లో అసభ్యకరంగా పోస్టులు చేసింద‌ని చెప్పారు.
arrests

More Telugu News