: భారత్ లో పెట్టుబడులను ఆపిన జనరల్ మోటార్స్!


అమెరికా కేంద్రంగా వాహన రంగంలో సేవలందిస్తున్న జనరల్ మోటార్స్ ఇండియాలో పెట్టాలని భావించిన పెట్టుబడులను ప్రస్తుతానికి ఆపివేయాలని నిర్ణయించింది. కొత్త ప్రొడక్టుల రీసెర్చ్, వాహనాల తయారీ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై నూతన పెట్టుబడుల ఆలోచనను పక్కన పెట్టినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇండియాలోనే 10 రకాల వాహనాలను తయారు చేసేలా దాదాపు రూ. 6,700 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు 2015లో ప్రకటించిన సంస్థ, ఇప్పుడా ఆలోచన నుంచి తప్పుకుంది.

ఇండియాలో వాహనదారుల ఆలోచనలు మారాయని, తమ పోర్ట్ ఫోలియోను పూర్తిగా సమీక్షించిన తరువాతే భవిష్యత్ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఇండియా సహా చైనా, మెక్సికో, బ్రెజిల్ దేశాల్లో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను పూర్తిగా నిలిపివేసే ఆలోచన లేదని చెప్పారు. కాగా, జనరల్ మోటార్స్ సంస్థ ఇండియా మార్కెట్లో బీట్, క్రూజ్ తదితర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News