: రైలు ప్రమాదం వెనుక కుట్ర... రంగంలోకి ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీం!


గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ మంత్రి మృణాళిని వ్యాఖ్యానించారు. రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాధారణ పరిస్థితుల్లో ఈ మార్గంలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు లేవని రైల్వే అధికారులు స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. రైలును ప్రమాదానికి గురి చేయడానికి విద్రోహుల కుట్ర జరిగివుండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. విచారణకు విమానయాన శాఖ సాంకేతిక సహకారం తీసుకోవాలని నిర్ణయించామని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విమానయాన శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్ టీముతో దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని మృణాళిని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News