: వోడాఫోన్ కన్నా రెండు రూపాయల తక్కువకే ఐడియా అపరిమిత ఇంటర్నెట్!


ఉచిత కాల్స్, ఉచిత డేటా అంటూ దూసుకొచ్చిన రిలయన్స్ జియోను అడ్డుకుని, తమ కస్టమర్ల బేస్ ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న టెలికం సంస్థలు పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వన్ అవర్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్యాక్ లు ఇప్పుడు మార్కెట్ ను ఊపేస్తున్నాయి. రూ. 16కు వోడాఫోన్ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ను ప్రకటించగా, దానికన్నా రెండు రూపాయల తక్కువకే ఐడియా సరికొత్త ప్యాక్ ను ఆఫర్ చేస్తోంది. రూ. 14తో రీచార్జ్ చేసుకుని గంట సేపు అపరిమిత ఇంటర్నెట్ ను వాడుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News