: అవి బెదిరింపులు కాదు...స్నేహపూర్వక మాటలు!: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్


కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్టీవో ఆఫీసులో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఒక వ్యక్తిని, దానిని చిత్రీకరించిన విలేకరిని బెదిరించారన్న వివాదంపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రాద్ స్పందించారు. దానిపై ఆయన మాట్లాడుతూ, అందులో అసలు వివాదం లేదని అన్నారు. తాము స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నామని చెప్పారు. ఈ ఘటనలో పది మంది అక్కడ గుమిగూడేసరికి ఆవేశంలో ఏవో అన్ పార్లమెంటరీ పదాలు దొర్లి ఉంటాయని అన్నారు.

అవేవీ కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని ఆయన వివరణ ఇచ్చారు. తాను కూడా మీడియా మిత్రుడితో మాట్లాడిన మాటలు సరదాగా అన్నవేనని తేల్చేశారు. గత 30 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తానేంటో తెలుసని, తనపై కక్ష కొద్దీ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పల్లెల్లో ఎలా మాట్లాడుతారో తాను అలాగే మాట్లాడానని ఆయన చెప్పారు. ఇందులో బెదిరింపులు లేవని, స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News