: బెంగళూరులో శాడిస్టు భర్త నిర్వాకం...పోలీసులను ఆశ్రయించిన భార్య
బెంగళూరులో ఓ శాడిస్టు భర్త నిర్వాకంతో భార్య బెంబేలెత్తిపోయి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే... బన్నేరుఘట్టలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవినాశ్ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్ మేట్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరూ సాఫ్ట్ వేర్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అవినాశ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో అవినాశ్ ను అతని భార్య ముట్టుకోనిచ్చేది కాదు. అయితే బొద్దింకలంటే ఆమెకు భయమన్న విషయం తెలిసిన అవినాశ్...ఆమెపైకి బొద్దింకలు వదులుతూ, బెదిరించి బలవంతంగా శృంగారంలో పాల్గొనేవాడు.
అయితే, తన ఇద్దరు పిల్లల కోసం ఇన్నాళ్లూ అతని ఆగడాలు భరించిన ఆమె, అతని తీరులో మార్పు రాకపోగా మరింత శాడిజం చూపిస్తుండడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మహిళా పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. మహిళా పోలీసుల విచారణలో, శృంగారంలో సహకరించకపోవడంతో ఆమెపైకి బొద్దింకలు వదిలానని చేసిన తప్పును అవినాశ్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిని కోర్టులో హాజరుపరచి, రిమాండ్ కు తరలించారు.