: మీరు నన్ను మంచి అధ్యక్షుడిగా, మంచి మనిషిగా తయారు చేశారు: అమెరికా ప్రజలకు ఒబామా లేఖ


అమెరికా అధ్యక్ష పదవి నుంచి ఇంకొన్ని గంటల్లో తప్పుకోనున్న ఒబామా, తమ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ చివరి లేఖ రాశారు. ఆ లేఖలో పొందుపరచిన విషయాలు...‘అమెరికాకు 44వ అధ్యక్షుడిగా సేవలందించే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతఙ్ఞతలు. ఈ ఆఫీసులో అధ్యక్షుడిగా నేర్చుకున్నవి అన్నీ మీ నుంచే నేర్చుకున్నాను. నన్ను మంచి అధ్యక్షుడిగా, మంచి మనిషిగా మీరు తయారు చేశారు. ‘అమెరికా’ ఏ ఒక్కరి ప్రాజెక్టు కాదు, అమెరికా ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తిమంతమైన ఒకే ఒక పదం ‘మనం’.. అంటే, ప్రజలందరం’ అని ఉద్వేగ భరితంగా రాసిన ఆ లేఖలో ఒబామా పేర్కొన్నారు.

తన పదవీ కాలంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు, విషాద సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తన హయాంలో ప్రవేశపెట్టిన  ‘ఒబామా కేర్ పథకం’ విజయవంతమైందని, అయితే, ఆ పథకాన్ని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News