: అమ్మాయిలకు రూమ్ అద్దెకు ఇవ్వడానికి జంకుతున్న హైదరాబాద్ వాసులు!
మీరు చదివింది నిజమే. హైదరాబాదులో అమ్మాయిలకు రూమ్ అద్దెకు ఇవ్వడానికి ఇంటి ఓనర్లు జంకుతున్నారు. ఈ విషయాన్ని 'నెస్ట్ అవే' అనే ప్రముఖ హోమ్ రెంటల్ సంస్థ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి చదువు నిమిత్తమో, ఉద్యోగాల నిమిత్తమో అధిక సంఖ్యలో అమ్మాయిలు హైదరాబాదుకు వస్తుంటారు. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 19 శాతం మంది ఇంటి ఓనర్లు మాంసాహారం తినేవారికి రూములు అద్దెకు ఇవ్వడం లేదట. కొంతమంది ఓనర్లు ప్రాంతీయతత్వంతో, మరి కొందరు ఓనర్లు కులమతాల కారణంగా రూమ్ అద్దెకు ఇవ్వడం లేదట. అయితే, మిగతా విషయాలు కొంత వరకు నిజమై ఉండొచ్చని... నాన్ వెజ్ అనేది మాత్రం సమస్య కాదని కొందరు వాదిస్తున్నారు. హైదరాబాదులో ఎక్కువ మంది మాంసాహారం తీసుకునే వారే ఉన్నారని వారు చెబుతున్నారు.