: గిట్టుబాటు ధర కల్పిస్తే ప్రత్తిపాటిని 'పొగాకు పుల్లారావు'గా పిలుచుకుంటాం: మాగంటి బాబు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే కనుక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పొగాకు పుల్లారావుగా పిలుచుకుంటామని టీడీపీ ఎంపి మాగంటి బాబు అనడంతో అందరూ నవ్వులు చిందించారు. విజయవాడలో టుబాకో రైతులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొనడంతో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చిన మాగంటి అందరినీ నవ్వించారు.
ప్రత్తిపాటి మాట్లాడుతూ, తానూ పొగాకు పండించిన రైతునేనని, పొగాకు రైతుల సమస్యలు తనకు తెలుసని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, పొగాకు రైతులకు రూ.2 వేలు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. అమరావతిలో రైతు భవనం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.