: కోహ్లీ నమ్మకమే నన్ను రిటైర్ మెంట్ నుంచి దూరంగా ఉంచింది: యువరాజ్


ఇంగ్లండ్ తో నిన్న జరిగిన వన్డేలో 150 పరుగులతో విరుచుకుపడ్డ యువరాజ్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటి చెప్పాడు. మ్యాచ్ అనంతరం యువీ మాట్లాడుతూ, తనపై కోహ్లీకి ఉన్న నమ్మకమే తాను రిటైర్మెంట్ ప్రకటించకుండా చేసిందని అన్నాడు. తాను ఒకానొక దశలో రిటైర్ కావాలనుకున్నానని... కానీ, తనపై కోహ్లీకి ఎంతో నమ్మకం ఉందని... కోహ్లీ నమ్మకాన్ని తాను నిలబెట్టానని చెప్పాడు.

టీమ్ కెప్టెన్, జట్టు సభ్యుల మద్దతు ఉన్నప్పుడు... ఆటోమేటిక్ గా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపాడు. తనపై తన సహచరులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్నానని చెప్పాడు. క్రికెట్లో కొనసాగాలా? వద్దా? అనుకున్న తరుణంలో తనకు ఎంతో మంది బాసటగా నిలిచారని తెలిపాడు. ఓటమిని అంగీకరించొద్దు అనేదే తన సిద్ధాంతమని యువీ చెప్పాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత ఇంత అద్భుతంగా ఆడటం పట్ల తాను చాలా గర్వంగా ఉన్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News