: విద్యుత్ చౌర్యం.. బాలీవుడ్ సీనియర్ నటి రతి అగ్నిహోత్రి దంపతులపై కేసు నమోదు


విద్యుత్ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో నాటి గ్లామర్ క్వీన్ రతి అగ్నిహోత్రి, ఆమె భర్త అనిల్ విర్వాణీపై ముంబైలో కేసు నమోదు చేశారు. సుమారు 46 లక్షలకు పైగా విద్యుత్ ఛార్జీలు కట్టకుండా తప్పించుకున్నందున వీరిపై వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింద ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ముంబైలోని వర్లీ సముద్ర తీరంలో ఆమె నివాసం ఉంది. ఆ ఇంటికి త్రీ ఫేజ్ కనెక్షన్ ఉంది. అయితే, తమకు సింగిల్ ఫేజ్ మీటరు ఉన్నట్టుగా చూపించి తక్కువ విద్యుత్ చార్జీలను చెల్లించినట్లుగా అధికారులు గుర్తించడంతో వారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్ సీనియర్ నటి అయిన రతి అగ్నిహోత్రి, దక్షిణాదిలో కూడా పలు చిత్రాల్లో నటించింది.

  • Loading...

More Telugu News