: అమెజాన్ మూడురోజుల బంపర్ ఆఫర్ నేటి అర్ధరాత్రి నుంచే!
గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆన్‌లైన్ విక్రయాల సంస్థ అమెజాన్ ప్రకటించిన బంపర్ ఆఫర్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు దాదాపు 100కు పైగా కేటగిరీల్లో 95 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఈ ఏడాది ప్రారంభం కానున్న మొదటి మెగా డిస్కౌంట్ సేల్ ఇదే. ఈ డిస్కౌంట్ లో భాగంగా పాప్యులర్ బ్రాండ్స్పై గ్రేట్ డీల్స్ ను తమ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్‌లో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, యాక్ససరీస్ వంటి ఎన్నో వస్తువులపై డిస్కౌంట్లను ప్రకటించింది.
అంతేగాక, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే మరింత అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ప్రధానంగా రూ.4,999కంటే ఎక్కువగా చెల్లింపులు చేస్తే అమెజాన్ వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం, అమెజాన్ యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. వీటితో పాటు అమెజాన్ ప్రీమియం సభ్యులకు మరో అద్భుత ఆఫర్ ప్రకటిస్తూ.. నాన్ ప్రైమ్ మెంబర్స్ కంటే ప్రైమ్ మెంబర్స్ 30 నిమిషాల ముందు టాప్ డీల్స్ ను పొందవచ్చని పేర్కొంది. తమ కస్టమర్లకు పర్యటన అనుభవాన్నిఅందించేందుకు ముసాఫిర్.కాంతోనూ ఒప్పందం చేసుకుంది.
తమ వినియోగదారులయిన 10 జంటలు అన్ని ఖర్చులతో సహా ఉచితంగా యూరప్ ట్రిప్ గెల్చుకోవచ్చని పేర్కొంది. అంతేగాక 10 మంది లక్కీ విన్నర్స్ ప్రతి రోజు రెనాల్ట్ క్విడ్ గెలుచుకోవచ్చని తెలిపింది. కస్టమర్లకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం అమెజాన్ ఇండియాలో తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు పేర్కొంది.