: రెండో వన్డేలో బయటపడ్డ కోహ్లీ, ధోనీ కెప్టెన్సీకి మధ్య తేడా!


కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 381 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బంతి అందించిన ప్రతి బౌలర్ తో మంతనాలు జరిపాడు. ప్రతి బంతికి ఏదో ఒక సూచన ఇస్తూ వారిపై ఒత్తిడి పెంచాడు. దీంతో కొన్ని బంతులు ఇంగ్లండ్ బ్యాట్స్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాయి.

గతంలో ఇలాంటి సందర్భాల్లో ధోనీ ఫీల్డర్లను మార్చేవాడు. బౌలర్ ఎలాంటి బంతులు వేయాలనుకుంటున్నాడో తెలుసుకునేవాడు. తదనుగుణంగా ఫీల్డర్స్ ను మోహరించేవాడు. అలాంటి ప్రయత్నమేదీ చేయని కోహ్లీ, భావోద్వేగాలను నియంత్రించుకోకుండా, ఎవరైనా బౌలర్ మిస్ ఫీల్డ్ చేస్తే చిరాగ్గా స్పందిస్తున్నాడు. ఒకసారి కీపర్ ధోనీ అలా బంతిని వదిలేసినప్పుడు కూడా కోహ్లీ గట్టిగా అరిచేయడం విశేషం. మరోపక్క, రెండు జట్ల పరుగుల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇంగ్లండ్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News