: చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్.. ఆ బహుమతి అక్కర్లేదని కౌంటర్!


చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్, అలాంటి బహుమతిని తాము తీసుకోమని చెప్పి గొప్పతనం చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే... భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తాజాగా మాట్లాడుతూ, ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా అడ్డంకిని అధిగమించి అణుశక్తి సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ) లో భారత్ కు సభ్యత్వాన్ని కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చైనా, ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని భారత్‌ కు బహుమతిగా ఇవ్వాలని అమెరికా చూస్తోందని ఆరోపించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

బహుమతిగా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వాన్ని భారత్‌ కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. దానిని సాధిస్తామని ఆయన చెప్పారు. అయితే గత కొన్నాళ్లుగా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి భారత్‌ యత్నిస్తుండగా.. ఎన్‌పీటీపై భారత్ సంతకం చేయకుండా ఎలా సభ్యుడిగా చేర్చుకుంటారని చైనా మోకాలు అడ్డుపెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమకు కూడా కావాలని కోరాలని పాక్ ను ఉసిగొల్పుతోంది. అంతే కాకుండా పాక్ కు మద్దతు కూడా పలుకుతోంది. 

  • Loading...

More Telugu News