: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 50.96 పాయింట్లు లాభపడి 27,308.60 వద్ద, ఎన్ఎస్ఈ 18.10 పాయింట్లు లాభపడి 8,435.10 పాయింట్ల వద్ద ముగిశాయి. గెయిల్, టాటా మోటార్స్ (డి), బీపీసీఎల్, భారతీ ఇన్ ఫ్రాటెల్, ఐడియా సెల్యులార్ మొదలైన కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అరబిందో ఫార్మా, లుపిన్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు తదితర సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.