: ఏఆర్ రెహమాన్ సంచలన నిర్ణయం... జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష!
మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూలంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తుండడంతో వారికి మద్దతుగా నిలవాలని రెహమాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమిళ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తూ రేపు ఒకరోజు నిరాహారదీక్షకు దిగాలని ఆయన నిర్ణయించారు. రెహమాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో జల్లికట్టు ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం పొందే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క, ఇది తమిళుల ఐక్యతను సూచిస్తోంది. కాగా, జల్లికట్టుకు అనుకూలంగా చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. అందులో భాగంగానే రెహమాన్ కూడా వారికి మద్దతు ప్రకటించడం ఈ ఉద్యమానికి మరింత ఊపునిస్తోంది.