: శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుడి నుంచి రూ.13.64 లక్షల విలువచేసే బంగారం స్వాధీనం


హైదరాబాద్ శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తోన్న సిబ్బందికి పెద్ద ఎత్తున బంగారం ప‌ట్టుబ‌డింది. మస్కట్‌ నుంచి ఒమర్‌ ఎయిర్‌లైన్స్‌ డబ్ల్యువై-235 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని త‌నిఖీ చేయ‌గా అత‌డి వ‌ద్ద 467 గ్రాముల బంగారం ఉన్న‌ట్లు గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఆ బంగారం విలువ 13.64 లక్షల రూపాయ‌లు ఉంటుంద‌ని చెప్పారు. బంగా‌రాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News