: నేను ఫోన్ చేసిన తర్వాత 'రెండు తొడలు కొట్టిన షాట్' పెట్టారు: బాలకృష్ణ


సిల్వర్ స్క్రీన్ పై తొడగొట్టాలంటే అది బాలయ్యకే సాధ్యం. ఆయన తొడగొడితే థియేటర్లు అదిరిపోతాయి. ఆయన తాజా చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణిలో' కూడా ఆయన రెండు సార్లు తొడగొట్టారు. ఒకసారి ఒక తొడ కొడితే, రెండోసారి గాల్లోకి ఎగిరి రెండు తొడలూ కొట్టారు. ఈ తొడగొట్టే సన్నివేశంపై బాలయ్య స్పందించారు. విడుదలకు ముందు ఒక తొడగొట్టటమే పెట్టారట. రీరికార్డింగ్ టైమ్ లో తాను చూశానని... ఆ తర్వాత తాను ఫోన్ చేయగానే రెండు తొడలూ కొట్టిన సన్నివేశాన్ని సినిమాలో పెట్టారని బాలయ్య చెప్పారు. క్రిష్ గొప్పదనం అదేనని.. మనం చెబితే ఆయన వింటారని ప్రశంసించారు.

ఈ సినిమాలో శాతకర్ణి కోసం ఓ కిరీటం చేయించామని... అయితే ఆ రోజుల్లో కిరీటాలు లేవు కాబట్టి... పట్టాభిషేకం సమయంలో రోమన్ తరహా కిరీటం వాడామని బాలయ్య చెప్పారు. తన వందో చిత్రం కావడం, ప్రజలకు తెలియని చరిత్ర కావడం, ఏపీ రాజధానికి అమరావతిని ఎంపిక చేయడం వల్ల ఈ సినిమాకు మంచి హైప్ వచ్చిందని తెలిపారు. 

  • Loading...

More Telugu News