: మ‌రో రికార్డుకు చేరువ‌లో కోహ్లీ.. నేటి వ‌న్డేలో 28 ర‌న్స్‌ చేస్తే సారథిగా వెయ్యి ప‌రుగులు!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డుకు చేరువ‌లో నిలిచాడు. నేడు ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేలో మ‌రో 28 ప‌రుగులు సాధిస్తే కెప్టెన్‌గా వెయ్యి ప‌రుగులు సాధించిన ఘ‌న‌త అందుకుంటాడు. తొలి వ‌న్డేలో 122 ప‌రుగుల‌తో కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడిన కోహ్లీ నేటి వ‌న్డేలో ఆ ఘ‌న‌త‌ను అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కెప్టెన్‌గా వెయ్యి ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల‌లో క‌పిల్‌దేవ్‌, అజారుద్దీన్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, గంగూలీ, ద్ర‌విడ్‌, ధోనీ ఉన్నారు.  కోహ్లీ ఇప్పుడు వీరి స‌ర‌స‌న చేర‌నున్నాడు.

More Telugu News