: ముందు చంద్రబాబును జీవో ఇమ్మనండి: ఎన్టీఆర్ వర్థంతిపై తలసాని
ఎన్టీఆర్ వర్థంతిని తెలంగాణలో అధికారికంగా జరపాలన్న విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు చేసిన డిమాండ్ పై మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ఎన్టీఆర్ వర్థంతిని అధికారికంగా జరిపేముందు ఏపీలో జీవో ఇమ్మని చంద్రబాబును కోరాలని సలహా ఇచ్చారు. ఏపీలో జీవో తీసుకువస్తే, ఆపై ఇక్కడ ఆలోచిద్దామన్నారు. ఈ కార్యక్రమం మౌఖిక ఆదేశాలతోనే అధికారికంగా జరుగుతుందని, జీవోలు అవసరం లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పై విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వం తరఫున ఆయన వర్థంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు.