: ఏం జరుగుతుందో?... కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్న సల్మాన్ ఖాన్


అక్రమంగా ఆయుధాలను కలిగివున్న కేసులో జోధ్ పూర్ జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేడు తీర్పును వెలువరించనుండగా, తీర్పు కోసం సల్మాన్ వేచి చూస్తున్నాడు. మంగళవారమే జోథ్ పూర్ చేరుకున్న ఆయన వెంట సోదరి అల్వేరా, కొందరు న్యాయవాదులు కూడా కోర్టుకు వచ్చారు. లైసెన్స్ ముగిసిపోయిన ఆయుధాలను ఆయన కలిగున్నాడని ఇప్పటికే నిరూపణ అయిన సంగతి తెలిసిందే.  

కేసు 1998లో నమోదు కాగా, విచారణ ఏళ్ల పాటు సాగింది. అక్టోబర్ 1, 2 తేదీల్లో సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన సల్మాన్, అక్రమ ఆయుధాలతో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ వద్ద పాయింట్ 22 రైఫిల్, పాయింట్ 32 రివాల్వర్ ఉన్నాయని పోలీసులు నిరూపించారు. జింకలను వేటాడిన కేసులో తప్పించుకున్నప్పటికీ, ఆయుధాలను కలిగున్న కేసు మాత్రం సల్మాన్ మెడకు చుట్టుకుంది. జనవరి 9వ తేదీతో విచారణ పూర్తి కాగా, కాసేపట్లో న్యాయమూర్తి తన తీర్పును వెలువరించనున్నారు.

  • Loading...

More Telugu News