: ఈ విషయంలో చైనా, పాకిస్థాన్ ల కంటే మనమే బెటర్!


అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టు విషయంలో చైనా, పాకిస్థాన్ ల కంటే ఇండియానే మెరుగైన స్థానంలో ఉంది. పాస్ పోర్టు కలిగి ఉండి, ముందస్తు వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశం ఆధారంగా వివిధ దేశాల పాస్ పోర్టులకు ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకుల్లో జర్మనీ తొలి స్థానంలో నిలిచింది. 157 పాయింట్లతో అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టు కలిగిన దేశంగా జర్మనీ టాప్ ప్లేస్ లో నిలబడింది. సింగపూర్ 156 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ క్రమంలో ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న దక్షిణకొరియాను వెనక్కి నెట్టేసింది. భారత్ 46 పాయింట్లతో 78వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ చైనా, పాక్ దేశాలను వెనక్కి నెట్టేసింది. ఆప్ఘనిస్థాన్ 23 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో నిలిచింది.

వివిధ దేశాలు పలు దేశాలకు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఈ సదుపాయం వల్ల వీసా లేకపోయినా... అక్కడకు వెళ్లిన తర్వాత ఎయిర్ పోర్టుల్లో విజిటర్స్ వీసా తీసుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పలు దేశాలకు భారత్ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పించింది. దీనికి ప్రతిగా పలు దేశాలు మనకు కూడా వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పించాయి. 

  • Loading...

More Telugu News