: పోలవరం బాధితులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన పవన్ కల్యాణ్


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం బాధితలుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. పోలవరం మండంలోని మూలలంక గ్రామస్థులు అధికారుల ఆగడాలపై పోరాటం చేస్తున్నారు. అయితే వారి ఆవేదన అరణ్యరోదన కావడంతో పవన్ కల్యాణ్ సహాయం కోరారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు వారు పవన్ కల్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలవనున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణం పేరిట తమ నుంచి 203 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తున్నారని మూలలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ భూములు తమకు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News