: చేనేత కార్మికుల దీనస్థితికి చలించిపోయిన ‘జనసేన’ అధినేత .. ‘చేనేత’ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్!


చేనేత కార్మికుల దీనస్థితికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ చలించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని కలిసింది. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని పవన్ ని వారు ఆహ్వానించారు. అందుకు, పవన్ అంగీకరించారు. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ‘చేనేత’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్వచ్ఛందంగా పవన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News