: మద్దెలచెరువు సూరి హత్య కేసులో కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

మద్దెలచెరువు సూరి హత్య కేసులో టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి సాక్షిగా హాజరు కావాలంటూ కోర్టు సమన్లు పంపిన నేపథ్యంలో వంశీ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, తన భర్త హత్యతో వంశీకి సంబంధముందని సూరి భార్య గంగుల భానుమతి గతంలో ఆరోపించారు. అయితే, కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కొట్టిపారేశారు వంశీ.

More Telugu News