: జడేజా స్పందనతో ఫ్లిప్ కార్ట్ కు ఫ్రీగా భారీ ప్రచారం!


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కు క్రికెటర్ జడేజా రూపంలో ఉచితంగా భారీ ప్రచారమే లభించింది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమీ తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్ మీ నోట్ 4ను ఈ నెల 19న విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ గా ఓ ట్వీట్ చేసింది.

"జనవరి 19న భారత కొత్త ఆల్ రౌండర్ వస్తున్నాడు. ఇండియాలోని అత్యున్నతమైన వారిలో అతను ఒకడు. ఎవరో గెస్ చేయగలరా?" అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించింది. దీనిపై క్రికెటర్ జడేజా సరదాగా స్పందించాడు. "ఫ్లిప్ కార్ట్, ఈ కొలవెరి ఢీ ఎందుకు? ఈ విషయాన్ని నాకు ముందుగానే తెలిపావా? నాకు 19న మ్యాచ్ ఉంది. మీ కార్యక్రమాన్ని20కి వాయిదా వేయగలరా?" అంటూ ట్వీట్ చేశాడు. జడ్డూ కామెంట్ పై నెటిజన్లు భారీగా స్పందించారు. ట్వీట్ల మీద ట్వీట్లతో హోరెత్తించారు. దీంతో, అటు ఫ్లిప్ కార్ట్ కి, ఇటు షియోమీకీ విపరీతమైన ప్రచారం ఫ్రీగా లభించినట్టైంది.

  • Loading...

More Telugu News