: సిబీఐ అధిపతిగా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ వర్మ!


సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తదుపరి చీఫ్ గా ఢిల్లీ పోలీసు బాస్ అలోక్ వర్మ నియమితులు కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోదీతో పాటు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్, కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేల కమిటీలో మోదీ, కేహార్ లు అలోక్ వర్మ నియామకానికి పచ్చజెండా ఊపగా, ఖర్గే వ్యతిరేకించినట్టు తెలుస్తోంది.
మాజీ సీబీఐ అధికారి, ఆర్ కే దుత్తాను ఈ పదవికి ఎంపిక చేయాలని కాంగ్రెస్ తరఫున ఖర్గే వాదించినట్టు సమాచారం. అయితే, ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ వెనుక దుత్తా తిరగడం, కోర్టులో కేసు వుండడంతో దుత్తా పేరును ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు. అలోక్ వర్మ పేరును ఇప్పుడే ఖరారు చేయవద్దని మరోసారి సమావేశమై చర్చిద్దామని ఖర్గే పేర్కొనగా, అందుకు మోదీ అంగీకరించనట్టు తెలుస్తోంది. కాగా, ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరాం అండ్ యూనియన్ టెరిటరీ) 1979 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా, తీహార్ జైలుకు డైరెక్టర్ జనరల్ గా వర్మ పని చేశారు.

  • Loading...

More Telugu News